The True Gospel త్యాగం అనగానే మనకి గుర్తుకొచ్చేది యేసుక్రీస్తు వారి సిలువయాగం. ఆనాడు అయన చేసిన త్యాగమే ఈనాడు మనం జీవించటానికి కారణం. అంతటి త్యాగమూర్తి అయిన యేసుక్రీస్తు వారిని మనం సేవించడం ఆనందకరం. మన పాపక్షమాపణ కొరకు ఆయన ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చారు. ఇతరుల పాపం కొరకు ఎవరు మరణం పొందడానికి ముందుకొస్తారు? స్వార్ధపూరితమైన లోకంలో మనం ఉన్నాం. మనలాంటి స్వార్ధపరుల కొరకు యేసుక్రీస్తు వారు నిస్వార్ధంగా తన రక్తాన్ని చిందించి మరణాన్ని పొందారు. ఇంతటి త్యాగం చేసిన ఆయన మనకేం చెప్పారు? ఎం చెయ్యమన్నారు? ఎలా జీవించమన్నారు? ఆయన చెప్పినది చెయ్యటం కష్టమా?? నా జవాబు అయితె ఆయన త్యాగం ముందు ఏది కష్టం కాదు. ఆయన చెప్పింది ఒక్కటే.. వాక్యానుసారంగ జీవించమని చెప్పారు, అది కష్టమా?? వాక్యం మనకి ఙ్ఞానాన్ని, ధైర్యాన్ని, ఆదరణను, మరిముఖ్యంగా మన జీవితాన్ని సరైన మార్గంలో ఉంచటానికి, నిత్యరాజ్యాన్ని చేరటానికి ఉపయోగపడుతుంది. ఙ్ఞానఘని అయిన వాక్యాన్ని ధ్యానించటం వలన, ఆ వాక్యాన్ని బట్టి మన ప్రవర్తనని మార్చుకొనుట వలన మనకి చాలా ఉపయోగకరం. వాక్యం మనల్ని పాపం చెయ్యకుండా పరిశుధంగా జీవించమని చెప్తుంది....