#post 4


ఒకే దేవుడున్నాడని నీవు నమ్ముతున్నావు. నీవలా నమ్మడం మంచిదే గానీ దయ్యాలు కూడా అది నమ్ముతాయి, నమ్మి వణుకుతాయి.
తెలివితక్కువవాడా! క్రియలు లేని నమ్మకం నిర్జీవమని తెలుసుకోవడానికి నీకిష్టం ఉందా?
మన పూర్వీకుడు అబ్రాహాము తన కుమారుడైన ఇస్సాకును బలివేధికమీద సమర్పించినప్పుడు క్రియలవల్ల న్యాయవంతుల లెక్కలోకి రాలేదా?
అతని క్రియలతో నమ్మకం పని చేసిందనీ, క్రియల ద్వారా నమ్మకం పరిపూర్ణమయిందనీ గమనించారా!
ఈ లేఖనం నెరవేరింది కూడా – అబ్రాహాము దేవునిమీద నమ్మకం ఉంచాడు. ఆ నమ్మకమే అతనికి నిర్దోషత్వంగా లెక్కలోకి వచ్చింది. అంతేగాక, అతనికి దేవుని స్నేహితుడని పేరు వచ్చింది.
మనిషి నమ్మకం ద్వారా మాత్రమే గాక క్రియల ద్వారా కూడా న్యాయవంతుల లెక్కలోకి వస్తాడని మీరు గ్రహిస్తున్నారు గదా.
యాకోబు 2:19-24

Comments